![]() |
![]() |
.webp)
'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ రోజు రోజుకి ఆసక్తిని కలిగిస్తోంది. అయితే శుక్రవారం జరిగిన ఎపిసోడ్-47 లో అలసిపోయి పడుకున్న కృష్ణని ఓదార్చడానికి మురారి వాళ్ళ అమ్మ జ్యూస్ తీసుకొని వస్తుంది. ఆమె మాట్లాడుతూ "కృష్ణ.. ఈ పనులన్నీ నీకు కొత్త కదా.. ఈ ఇల్లు జైలు కాదు. కానీ కొన్ని నియమాలు ఉన్నాయి. ఇది రిటైర్డ్ ఆర్మీ మేజర్ ఇల్లు. అందుకే ఇన్ని నియమాలు. అందరూ వీటిని పాటిస్తారు కాబట్టి ఎవరికీ ఏం ఇబ్బంది ఉండదు. నీకు ఏమైనా అవసరం ఉంటే చెప్పమ్మ.. మొహమాటపడకు" అని చెప్పేసి వెళ్తుంది.
ఆ తర్వాత మురారి వాళ్ళ ఇంటికి ఒక కానిస్టేబుల్ వస్తాడు. "కమీషనర్ ఈ లెటర్ మురారి సర్ కి ఇవ్వమన్నారు" అని వాళ్ళ అమ్మకి తీసుకొచ్చి ఇస్తాడు. ఆ తర్వాత అది తీసుకెళ్ళి మురారికి ఇస్తుంది. ఆ లెటర్ లో శివన్న అనే వ్యక్తి.. ఇంక ఆ ఊరి పెద్దలు కొందరు కలిసి కంప్లేంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఊరి అమ్మాయిని బలవంతంగా పెళ్ళి చేసుకున్నాడు. అది తప్పు అని నిరూపించుకున్న తర్వాతనే మళ్ళీ విధుల్లోకి రావాలని అందులో ఉంటుంది.వెంటనే మురారి కమీషనర్ దగ్గరికి వెళ్తాడు.
మురారి హడావిడిగా వెళ్లడం చూసిన ముకుంద.. ఏమై ఉంటుందా అని ఆ లెటర్ చదువుతుంది. అది చదివాక మురారి సస్పెండ్ అయిన విషయం తెలుస్తుంది. వెంటనే ఇంట్లో వాళ్లకి ఆ విషయం చెప్తుంది. అందరికి కృష్ణ వల్లనే సస్పెండ్ అయ్యాడని తెలుస్తుంది. ఆ తర్వాత కృష్ణని పిలిచి భవాని అడుగుతుంది. "శివన్న ఎవరు? నీ వల్ల నా కొడుకు సస్పెండ్ అయ్యాడు. కొత్త కోడలు అత్తగారింటికి వచ్చినప్పుడు చీరా.. సారె తీసుకొస్తారు. ఈ మహాతల్లేమో అరిష్టాలని, అప్రతిష్టలని తీసుకొచ్చింది" అని కోప్పడుతుంది భవాని. ఎన్ని మాటలు అన్నా కూడా కృష్ట మౌనంగా ఉండిపోతుంది. ఆ తర్వాత తన గదిలోకెళ్ళి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకుంటూ బాధపడుతుంది.
![]() |
![]() |